Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్న బొడిగె శోభ?

  • బొడిగె శోభకు టికెట్ కేటాయించని కేసీఆర్
  • పలుమార్లు విన్నవించినా.. దక్కని ఫలితం
  • బీజేపీ తరపున పోటీ చేసే యోచనలో శోభ
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ టీఆర్ఎస్ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెకు ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితులు కనపడటం లేదు. తనకు టికెట్ కేటాయించాలని ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె కోరినా... కేసీఆర్ నుంచి సానుకూల స్పందన రాలేదు.

ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్  కు రాజీనామా చేసేందుకు ఆమె సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీజేపీ తరపున ఆమె పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నిన్న తన అనుచరులతో ఆమె సమావేశమై, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరడాన్ని కొందరు కార్యకర్తలు వ్యతిరేకించినా, ఎక్కువ మంది ఆమె నిర్ణయానికి మద్దతు పలికారు. ఈ రోజు ఆమె తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
bodige sobha
choppadandi
TRS
bjp

More Telugu News